చందంపేట, అక్టోబర్ 11 (ఆయుష్ 24 న్యూస్):
చందంపేట మండలంలోని సేవాలాల్ తండా గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ ఆలయంలో ప్రతిష్ఠించిన శ్రీశ్రీశ్రీ మహాలక్ష్మమ్మ తల్లి విగ్రహాన్ని PACS చైర్మన్ జాలే నరసింహారెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మహాలక్ష్మమ్మ తల్లి విగ్రహాన్ని సుమారు రూ.65,000 వ్యయంతో సమకూర్చిన నరసింహారెడ్డి, అమ్మవారి దివ్య ఆశీస్సులతో దేవరకొండ నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలు నరసింహారెడ్డిని శాలువాతో ఘనంగా సత్కరించి, తీర్థప్రసాదాలు అందజేశారు. అడిగిన వెంటనే స్పందించి సహకారం అందించిన జాలే బ్రదర్స్ నరసింహారెడ్డి, తిలక్ రెడ్డిలకు గ్రామస్థులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వారి కుటుంబ సభ్యులపై మహాలక్ష్మమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పార్వతి చందు నాయక్, మాజీ సర్పంచ్ అంజయ్య, బావోజి సూర్య, ఇప్ప తిరుపతి రెడ్డి, వెంకులు, శ్రీను, ఆంజనేయులు, జబ్బర్, స్వామి, మంగు తదితరులు పాల్గొన్నారు.
– ఆయుష్ 24 న్యూస్
The Voice of Truth
సేవాలాల్ తండాలో మహాలక్ష్మమ్మ తల్లికి ప్రత్యేక పూజలు రూ.65 వేలతో మహాలక్ష్మమ్మ విగ్రహాన్ని సమకూర్చిన జాలే నరసింహారెడ్డి
చందంపేట, అక్టోబర్ 11 (ఆయుష్ 24 న్యూస్): చందంపేట మండలంలోని సేవాలాల్ తండా గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ ఆలయంలో ప్రతిష్ఠించిన శ్రీశ్రీశ్రీ మహాలక్ష్మమ్మ తల్లి విగ్రహాన్ని PACS చైర్మన్ జాలే నరసింహారెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాలక్ష్మమ్మ తల్లి విగ్రహాన్ని సుమారు


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →








Leave a Reply