రూ.43,100 ఆర్థిక సహాయం సమీకరణ.. సెప్టెంబర్ 20న అందజేత
హైదరాబాద్, సెప్టెంబర్ 19 (ప్రతినిధి): తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరానికి చెందిన సీనియర్ కుంగ్‌ఫూ, కరాటే మాస్టర్ విక్రమ్ గారి కుమార్తె మాస్టర్ భవిత సెప్టెంబర్ 5న అకాల మరణం చెందడంతో ఆమె కుటుంబాన్ని ఆదుకునేందుకు వివిధ మార్షల్ ఆర్ట్స్ సంస్థలకు చెందిన మాస్టర్లు ముందుకు వచ్చారు.
మాస్టర్ భవిత కుటుంబానికి సహాయం అందించేందుకు ASMAA ఆధ్వర్యంలో సహాయ కార్యక్రమాన్ని చేపట్టగా, విషయం తెలుసుకున్న పలువురు కుంగ్‌ఫూ, కరాటే, మార్షల్ ఆర్ట్స్ మాస్టర్లు వ్యక్తిగతంగా స్పందించి తమ వంతు ఆర్థిక సహాయాన్ని అందించారు.
ఇప్పటివరకు 42 మంది మాస్టర్లు, దాతలు కలిసి మొత్తం రూ.43,100 సహాయాన్ని సమకూర్చినట్లు వివరాలు వెల్లడయ్యాయి. ఈ మొత్తాన్ని సెప్టెంబర్ 20న మాస్టర్ విక్రమ్ కుటుంబానికి అందజేయాలని నిర్వాహకులు నిర్ణయించారు.

ఈ సందర్భంగా మార్షల్ ఆర్ట్స్ రంగానికి చెందిన పలువురు మాస్టర్లు మానవతా దృక్పథంతో స్పందించడం పట్ల నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. కష్టకాలంలో బాధిత కుటుంబానికి అండగా నిలవడం ద్వారా మార్షల్ ఆర్ట్స్ కుటుంబం తమ ఐక్యతను చాటిందని పేర్కొన్నారు.
💐 సహాయ కార్యక్రమానికి సంప్రదింపు / విరాళాల వివరాలు
PhonePe / Google Pay: 9347994779
ఆయుష్ 24 న్యూస్ తరఫున:
మాస్టర్ విక్రమ్ గారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ కష్ట సమయంలో కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ అభినందనలు. 🙏
అయుష్ 24 న్యూస్ — The Voice of Truth










Leave a Reply