దేవరకొండలో కరెంట్ షాక్తో భార్యాభర్తల మృతి
దేవరకొండ, సెప్టెంబర్ 23 (ప్రతినిధి):
నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలో బుధవారం విషాద ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ షాక్కు గురై భార్యాభర్తలు మృతి చెందినట్లు సమాచారం.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవరకొండ పట్టణంలోని అంజయ్య కాలనీలో నివాసం ఉంటున్న దంపతులు ఇంట్లో ఉండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. టెంపుల్ ఫ్యాన్ స్విచ్ వేయడంతో ముందుగా భార్యకు విద్యుత్ షాక్ తగిలినట్లు సమాచారం. ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన భర్త కూడా విద్యుత్ షాక్కు గురైనట్లు స్థానికులు తెలిపారు.
ఈ ఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది.
ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.










Leave a Reply