ఆకట్టుకున్న మహిళల కోలాటాలు, నృత్యాలు
భజనలు, కీర్తనలతో భక్తిశ్రద్ధల మధ్య శోభాయాత్ర
దేవరకొండ, సెప్టెంబర్ 23 (ప్రతినిధి): దేవరకొండ పట్టణంలోని అయ్యప్ప నగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. నవరాత్రుల పాటు భక్తుల పూజలందుకున్న విఘ్నేశ్వరుడిని పట్టణ పురవీధుల గుండా భజనలు, కీర్తనలు, నృత్యాలతో ఊరేగించి భక్తిశ్రద్ధల మధ్య నిమజ్జనానికి తరలించారు.
శోభాయాత్రలో కాలనీ మహిళలు ప్రదర్శించిన కోలాటాలు, నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తుల ఆటపాటలు, గణపతి నామస్మరణతో అయ్యప్ప నగర్ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి.
ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ నిర్వాహకులు మాట్లాడుతూ, నవరాత్రుల పాటు కాలనీవాసులు, మహిళలు భక్తిశ్రద్ధలతో గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. నిమజ్జనాన్ని సైతం మహిళల కోలాటాలు, నృత్యాలు, భక్తుల ఆటపాటల మధ్య ఘనంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం ఇదే విధంగా కాలనీ ప్రజల సహకారంతో వినాయక నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

నిమజ్జన శోభాయాత్రలో పాల్గొన్న భక్తుల కోసం సూర్యతండా సర్పంచ్ నేనావత్ కవిత–లచ్చిరాం నాయక్, 10వ వార్డు కౌన్సిలర్ గుద్దేటి మాధవి–సత్యం ఆధ్వర్యంలో మంచినీటి సదుపాయం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు, మహిళలు, భక్తులు, కాలనీవాసులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అయుష్ 24 న్యూస్










Leave a Reply