నిమ్స్ ఆసుపత్రికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న తుంగతుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు
హైదరాబాద్, సెప్టెంబర్ 21 (ప్రతినిధి):
ఆకారపు వెంకన్న గారి మాతృమూర్తి శ్రీమతి ఆకారపు ముత్తమ్మ కొంతకాలంగా అనారోగ్యంతో పంజాగుట్టలోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో తుంగతుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేగటి రవికుమార్ ఆమెను పరామర్శించారు.
రేగటి రవికుమార్‌తో పాటు రేగటి వెంకటేష్, పులిపంపుల కంట్లం, రేగటి సుధాకర్ తదితరులు నిమ్స్ ఆసుపత్రికి వెళ్లి ముత్తమ్మ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
అనంతరం నిమ్స్ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజ్ కుమార్ ఆహ్వానం మేరకు ఆసుపత్రి ప్రాంగణంలోని శ్రీ వినాయక స్వామి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో వారు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
ఈ సందర్భంగా సూపరింటెండెంట్ రాజ్ కుమార్ రేగటి రవికుమార్ తదితరులను సన్మానించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply