ఆయుష్ 24 న్యూస్‌కు స్పందన
వెంకటేశ్వర్లు కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన దాతలు
స్పందించిన దేవరకొండ హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్
వెంకటేశ్వర్లు కుటుంబానికి రూ.10,000 ఆర్థిక సహాయం
దేవరకొండ: అనారోగ్యంతో మంచానికే పరిమితమై తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న దువ్వ వెంకటేశ్వర్లు కుటుంబ పరిస్థితిపై ఆయుష్ 24 న్యూస్ వరుస కథనాలను ప్రచురించింది. ఈ కథనాలు వేలాది మందికి చేరడంతో వెంకటేశ్వర్లు కుటుంబం ఎదుర్కొంటున్న దీనస్థితిపై పలువురు స్పందిస్తున్నారు.కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే వెంకటేశ్వర్లు అనారోగ్యం కారణంగా మంచానికే పరిమితం కావడంతో కుటుంబం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితిని ఆయుష్ 24 న్యూస్ అక్షర రూపంలో ప్రజల ముందుకు తీసుకెళ్లింది. దీంతో కొందరు సానుభూతి వ్యక్తం చేయగా, మరికొందరు “మేమున్నాం” అంటూ తమకు తోచిన విధంగా ఆర్థిక సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు.వెంకటేశ్వర్లు కుటుంబానికి రూ.10,000 ఆర్థిక సహాయంఆయుష్ 24 న్యూస్ కథనాలకు స్పందించిన దేవరకొండ పట్టణానికి చెందిన హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్ సభ్యులు తమ వంతుగా ఆర్థిక సహాయం అందించారు.అసోసియేషన్ సభ్యులు కలిసి సమకూర్చిన రూ.10,000 నగదును ఆదివారం వెంకటేశ్వర్లు ఇంటికి వెళ్లి, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.అనారోగ్యంతో బాధపడుతున్న వెంకటేశ్వర్లు త్వరగా కోలుకోవాలని, ఆయన కుటుంబానికి భవిష్యత్తులో మరింత సహాయం అందాలని సభ్యులు ఆకాంక్షించారు.హెల్పింగ్ హ్యాండ్స్ సేవలు అభినందనీయంఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలుస్తూ, తమకు తోచిన సహాయాన్ని అందిస్తున్న దేవరకొండ హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్ సేవలు ప్రశంసనీయమని పలువురు అభినందించారు. సమాజంలో ఆపదలో ఉన్నవారికి చేయూత అందించడం ద్వారా మానవత్వానికి నిదర్శనంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కేశ నరేష్, నరేష్ రెడ్డి, 7వ వార్డు కౌన్సిలర్ హనుమంతు సాయి చంద్ర గౌడ్, పగిడిమర్రి నాగరాజు, అంజి చారి, బాదం నరేష్, కోర్ర సుమన్, జెల్లా అంజి తదితరులు పాల్గొన్నారు.— Ayush24 News#Ayush24News #Devarakonda #HelpingHandsAssociation #Humanity #FinancialHelp #Venkateshwarlu #DevarakondaNews #Ayush24NewsResponse

