Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి● నవంబర్ 6లోగా పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి● బీసీల రాజ్యాధికారమే మా ధ్యేయం: తీన్మార్ మల్లన్న● దేవరకొండ నియోజకవర్గంలో రేపు ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన● రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడిని పరామర్శించిన ఎమ్మెల్యే బాలు నాయక్● సిటీ సివిల్ కోర్టును సందర్శించిన MSS లా కళాశాల విద్యార్థులు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి● నవంబర్ 6లోగా పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి● బీసీల రాజ్యాధికారమే మా ధ్యేయం: తీన్మార్ మల్లన్న● దేవరకొండ నియోజకవర్గంలో రేపు ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన● రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడిని పరామర్శించిన ఎమ్మెల్యే బాలు నాయక్● సిటీ సివిల్ కోర్టును సందర్శించిన MSS లా కళాశాల విద్యార్థులు
Home › తెలంగాణ › ఇందిరమ్మ ఇళ్లతో పేదల ఆర్థిక స్థితి మెరుగుపడాలి: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
తెలంగాణ

ఇందిరమ్మ ఇళ్లతో పేదల ఆర్థిక స్థితి మెరుగుపడాలి: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

03:44 మధ్యాహ్నం PM

గాజుల రామారంలో 480 ఇందిరమ్మ టవర్స్‌కు శంకుస్థాపన

పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ఎంత వ్యయమైనా భరించేందుకు ప్రభుత్వం సిద్ధమని వెల్లడి

గాజుల రామారం, అక్టోబర్ 06, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ద్వారా పేదల ఆర్థిక స్థితిగతులను మెరుగుపర్చాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఐటీ, పరిశ్రమలు, రంగారెడ్డి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. మంగళవారం రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి గాజుల రామారంలో 480 ఇళ్లతో నిర్మించనున్న ఇందిరమ్మ టవర్స్‌కు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు.

ఔటర్ రింగ్ రోడ్డు లోపల కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) పరిధిలో భూముల ధరలు భారీగా పెరిగినప్పటికీ, పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ఎంత వ్యయమైనా భరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిర్ణయించారని శ్రీధర్ బాబు తెలిపారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తయిన తర్వాత వాటి విలువ రూ.50 లక్షలకు పైగా ఉంటుందని, తద్వారా పేద, మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు అవకాశం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు.

కొత్తగా నిర్మించే టవర్స్ సముదాయంలో ఆలయాలు, మసీదులు, చర్చిల వంటి ప్రార్థనా మందిరాల నిర్మాణానికి ప్రత్యేకంగా స్థలం కేటాయించే అంశాన్ని పరిశీలించాలని కలెక్టర్‌ను ఆదేశించినట్లు తెలిపారు. సొంత ఇల్లు కలిగి ఉండటం జీవితంలో అత్యంత ముఖ్యమైన అంశమని పేర్కొన్నారు.

క్యూర్ పరిధిలోని కాలుష్య పరిశ్రమలను వెలుపలికి తరలించి, ప్రజలకు స్వచ్ఛమైన గాలి అందేలా చర్యలు తీసుకుంటున్నామని శ్రీధర్ బాబు తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన ఆరు హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని, వాటిలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అత్యంత ప్రాధాన్యత ఉందని ఆయన వెల్లడించారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 9🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
366 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App