రాప్తాడు: ఈనెల 22న రాప్తాడు మండల కేంద్రానికి మంత్రి నారా లోకేశ్ రానున్నట్లు ఎమ్మెల్యే పరిటాల సునీత తెలిపారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్, పరిటాల రవీంద్ర కాంస్య విగ్రహాలను మంత్రి ఆవిష్కరించనున్నట్లు పేర్కొన్నారు.
మంత్రి పర్యటన నేపథ్యంలో రాప్తాడు మండల కేంద్రంలో విగ్రహాల ఏర్పాటు పనులను ఎమ్మెల్యే పరిటాల సునీత పరిశీలించారు. కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు.
ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లను సమన్వయంతో చేపట్టాలని, పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు, నాయకులకు ఎమ్మెల్యే సూచించారు.
మంత్రి పర్యటన విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు.
— ఆయుష్ 24 న్యూస్ ప్రతినిధి










Leave a Reply