లాల్పహాడ్, సెప్టెంబర్ 22 (ప్రతినిధి): బీసీ రాజ్యాధికార యాత్ర 6వ రోజు లాల్పహాడ్ నుంచి తండుపల్లి వైపు కొనసాగింది. యాత్రలో భాగంగా నిర్వాహకులు, నాయకులు ప్రజలను కలుసుకుంటూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
మార్గమధ్యంలో ఓ టీ దుకాణం వద్ద ఆగిన మల్లన్న.. టీ షాప్ నిర్వాహకుడితో మాట్లాడి వారి కష్టాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులపై వివరాలు తెలుసుకున్నారు.
యాత్రకు స్థానిక బీసీ నాయకులు సంఘీభావం తెలిపారు. ప్రజలను కలుస్తూ, వారితో మాట్లాడుకుంటూ వారి సమస్యలను తెలుసుకుంటూ యాత్ర కొనసాగింది.
లాల్పహాడ్ నుంచి తండుపల్లి వైపు సాగిన ఈ యాత్రలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










Leave a Reply