Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలున్నా పరస్పర గౌరవం అవసరం: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా● రూ.16 వేల కోట్లకు పైగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై ప్రధాని మోదీ సమీక్ష● దేవరకొండ మునగాల కొండలరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 12వ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు● రేపటి ఎమ్మెల్యే బాలునాయక్ పర్యటన షెడ్యూల్ దేవరకొండ నియోజకవర్గంలో గురువారం పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న ఎమ్మెల్యే● పెద్దపల్లి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించకపోవడానికి మంత్రి శ్రీధర్ బాబే కారణం: పుట్ట మధూకర్● ఈ-వేస్ట్ నిర్వహణపై విద్యార్థులకు అవగాహన● ఎల్ నినో ప్రభావం-నివారణ చర్యలపై విద్యార్థులకు అవగాహన సదస్సు● రాష్ట్రస్థాయి సీనియర్ మహిళల కబడ్డీ పోటీలకు దేవరకొండ క్రీడాకారిణి పూజ ఎంపిక● ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలున్నా పరస్పర గౌరవం అవసరం: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా● రూ.16 వేల కోట్లకు పైగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై ప్రధాని మోదీ సమీక్ష● దేవరకొండ మునగాల కొండలరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 12వ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు● రేపటి ఎమ్మెల్యే బాలునాయక్ పర్యటన షెడ్యూల్ దేవరకొండ నియోజకవర్గంలో గురువారం పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న ఎమ్మెల్యే● పెద్దపల్లి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించకపోవడానికి మంత్రి శ్రీధర్ బాబే కారణం: పుట్ట మధూకర్● ఈ-వేస్ట్ నిర్వహణపై విద్యార్థులకు అవగాహన● ఎల్ నినో ప్రభావం-నివారణ చర్యలపై విద్యార్థులకు అవగాహన సదస్సు● రాష్ట్రస్థాయి సీనియర్ మహిళల కబడ్డీ పోటీలకు దేవరకొండ క్రీడాకారిణి పూజ ఎంపిక
Home › తాజా వార్తలు › ఉప్పల్ తాత్కాలిక బస్టాండ్ వద్ద అధ్వానంగా రోడ్ల దుస్థితి
తాజా వార్తలు

ఉప్పల్ తాత్కాలిక బస్టాండ్ వద్ద అధ్వానంగా రోడ్ల దుస్థితి

08:03 ఉదయం AM

బురదలో కూరుకుపోయిన సూపర్ లగ్జరీ బస్సు.. ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు

ఉప్పల్ | AYUSH24 NEWS

ఉప్పల్ నియోజకవర్గంలోని ఉప్పల్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా కేంద్రాలకు వెళ్లే బస్సుల తాత్కాలిక బస్టాప్ వద్ద రోడ్ల దుస్థితి తీవ్రంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా బస్టాండ్ పరిసర ప్రాంతం పూర్తిగా బురదమయంగా మారడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

బస్టాప్ వద్ద మట్టి, బురద పేరుకుపోవడంతో ప్రజలు నడవడానికి కూడా వీలు లేకుండా పరిస్థితి నెలకొంది. వృద్ధులు, మహిళలు, చిన్నారులు బస్సులు ఎక్కడానికి, దిగడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అధ్వానంగా మారిన రహదారి కారణంగా ఓ సూపర్ లగ్జరీ ఆర్టీసీ బస్సు సైతం బురదలో కూరుకుపోవడం స్థానికులను ఆందోళనకు గురిచేసింది. దీంతో కొంతసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ప్రజలు, ప్రయాణికులు స్పందిస్తూ బస్టాండ్ పరిసర ప్రాంతంలో వెంటనే రోడ్డు మరమ్మతులు చేపట్టి, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులను కోరుతున్నారు. ప్రయాణికుల భద్రత, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

– AYUSH24 NEWS
“The Voice of Truth”

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 6🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
683 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App