దేవరకొండ, అక్టోబర్ 14:
ఉమ్మడి నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామ్‌రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను విస్తృతంగా చేపట్టి, రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా కృషి చేయాలని ఎమ్మెల్యేను కోరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలు, పార్టీ ఆదేశాల మేరకు నియోజకవర్గంలో పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామ్‌రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి విజయానికి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి సమన్వయంతో పనిచేస్తానని పేర్కొన్నారు.
దేవరకొండ నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థికి అధిక మెజారిటీ వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పార్టీ శ్రేణులంతా సమన్వయంతో ముందుకు సాగుతూ, అర్హులైన పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించాలని సూచించారు.
— ఆయుష్ 24 న్యూస్
ఎమ్మెల్యే బాలునాయక్‌ను కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రామ్‌రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి
దేవరకొండ, అక్టోబర్ 14: ఉమ్మడి నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామ్‌రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను విస్తృతంగా చేపట్టి, రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →







Leave a Reply