ఘనంగా గణేష్ లడ్డూ వేలం.. భక్తుల్లో ఆనందం
దేవరకొండ, సెప్టెంబర్ 23 (ప్రతినిధి):
దేవరకొండ పట్టణంలోని ఎల్ఐసీ కాలనీలో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన గణేష్ లడ్డూ వేలం ఘనంగా జరిగింది. ఈ వేలంలో గణేష్ లడ్డూ రూ.2,50,000 (రెండు లక్షల యాభై వేల రూపాయలు) ధర పలికింది.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీ రామావత్ హన్మా నాయక్ పాల్గొని భక్తులను అభినందించారు. గణేష్ లడ్డూ భారీ ధరకు వేలం కావడంతో ఎల్ఐసీ కాలనీ ప్రజలు, భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.
గణనాథుడి ఆశీస్సులతో ఎల్ఐసీ కాలనీలో వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా కొనసాగుతున్నాయని నిర్వాహకులు తెలిపారు.










Leave a Reply