దేవరకొండ,28అక్టోబర్ ( ఆయుష్షు 24 న్యూస్ ప్రతినిధి ):మండలంలోని మైనంపల్లి వద్ద గల తెలంగాణ ప్రభుత్వ మహిళా, గిరిజన బాలికల డిగ్రీ కళాశాలలో బుధవారం సర్పంచ్ రాంసింగ్ నాయక్ ఆధ్వర్యంలో ‘ఎల్ నినో ప్రభావం – నివారణ చర్యలు’ అనే అంశంపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. మారుతున్న వాతావరణ పరిస్థితులు, ఎల్ నినో ప్రభావం వల్ల కలిగే నష్టాలు, వర్షాభావ పరిస్థితులు, వ్యవసాయంపై పడే ప్రభావం మరియు నీటి సంరక్షణ ఆవశ్యకతను విద్యార్థులకు వివరించారు. భవిష్యత్తులో ఎదురయ్యే వాతావరణ సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించాలని, నీటిని వృథా చేయకుండా ప్రతి నివాసంలోనూ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆర్.సి.ఓ శ్రీనివాస రాయ్, ఎంపీడీఓ పార్వతి, ఆర్.డబ్ల్యు.ఎస్ డి.ఇ నగేష్, ఎ.ఇ హుస్సేన్, ఎ.ఇ.ఓ అభిలాష్, కళాశాల ప్రిన్సిపాల్ హరిప్రియ, వార్డు సభ్యులు కొర్ర కిషన్, వెంకట్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఎల్ నినో ప్రభావం-నివారణ చర్యలపై విద్యార్థులకు అవగాహన సదస్సు
దేవరకొండ,28అక్టోబర్ ( ఆయుష్షు 24 న్యూస్ ప్రతినిధి ):మండలంలోని మైనంపల్లి వద్ద గల తెలంగాణ ప్రభుత్వ మహిళా, గిరిజన బాలికల డిగ్రీ కళాశాలలో బుధవారం సర్పంచ్ రాంసింగ్ నాయక్ ఆధ్వర్యంలో 'ఎల్ నినో ప్రభావం - నివారణ చర్యలు' అనే అంశంపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →








Leave a Reply