Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి
Home › బ్రేకింగ్ న్యూస్ › ఓదెల రైల్వే ఆర్‌యూబీ-74ఏ పనులను మార్చి 2027లోగా పూర్తి :పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
బ్రేకింగ్ న్యూస్

ఓదెల రైల్వే ఆర్‌యూబీ-74ఏ పనులను మార్చి 2027లోగా పూర్తి :పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

02:22 తెల్లవారుజాము AM

పెద్దపల్లి: పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలకు సంబంధించిన పెండింగ్ రైల్వే సమస్యలు, అభివృద్ధి పనులను త్వరితగతిన ముందుకు తీసుకెళ్లాలని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్‌ను కోరారు.

ఇటీవల రైల్వే దక్షిణ మధ్య జోన్ జనరల్ మేనేజర్‌ను కలిసి పెద్దపల్లి, మంచిర్యాల ప్రాంతాలకు సంబంధించిన పలు పెండింగ్ డిమాండ్లపై ఎంపీ ప్రత్యేకంగా చర్చించారు. ప్రజలకు నేరుగా ఉపయోగపడే రైల్వే మౌలిక వసతుల పనులను ఆలస్యం లేకుండా పూర్తి చేయాలని కోరారు.

ఈ సందర్భంగా ఓదెల రైల్వే స్టేషన్ పరిధిలోని ఎల్‌సీ-30కు సంబంధించి శాశ్వత పరిష్కారం కల్పించాలని ఎంపీ కోరారు. దీనిపై రైల్వే అధికారులు ఇప్పటికే ఆర్‌యూబీ-74ఏ (Road Under Bridge) నిర్మాణ పనులను చేపడుతున్నారని, ఇందుకు సంబంధించిన శాంక్షన్ కూడా పూర్తయిందని తెలిపారు.

ఆర్‌యూబీ-74ఏ నిర్మాణాన్ని మార్చి 2027 నాటికి పూర్తి చేస్తామని రైల్వే అధికారులు లిఖితపూర్వకంగా హామీ ఇచ్చినట్లు ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. ఓదెల ప్రాంత ప్రజలకు ఎంతోకాలంగా ఎదురవుతున్న రాకపోకల సమస్యకు ఈ ఆర్‌యూబీ నిర్మాణం పూర్తయితే శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉందన్నారు.

రైల్వే అధికారులు ఇచ్చిన హామీ మేరకు పనుల పురోగతిపై నిరంతరం ఫాలోఅప్ చేస్తూ, ఆర్‌యూబీ-74ఏ పనులను నిర్ణీత గడువులో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తామని ఎంపీ గడ్డం వంశీకృష్ణ స్పష్టం చేశారు.

పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలకు సంబంధించిన పెండింగ్ రైల్వే సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలను నిరంతరం కొనసాగిస్తామని ఆయన తెలిపారు

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 9🔗 Shares: 2👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
366 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App