లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ ఆధ్వర్యంలో హంగర్ రిలీఫ్ కార్యక్రమం
పేదల ఆకలి తీర్చడమే గొప్ప సేవ: లయన్ గుద్దేటి జంగయ్య
దేవరకొండ, సెప్టెంబర్ 5, అయుష్ 24 న్యూస్:
ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం కంటే గొప్ప సేవ మరొకటి లేదని లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ ప్రెసిడెంట్ లయన్ గుద్దేటి జంగయ్య అన్నారు.
లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ ట్రెజరర్ లయన్ చిలుకూరి కాశీనాథ్–వసుధ దంపతుల కుమారుడు చిలుకూరి కార్తికేయ జన్మదినాన్ని పురస్కరించుకుని శనివారం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో హంగర్ రిలీఫ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 300 మందికి ఉచితంగా అల్పాహారం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ సభ్యులు కార్తికేయను ఆశీర్వదించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
లయన్ గుద్దేటి జంగయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులతో పాటు వారి అటెండర్లకు ప్రతి రోజు ఉదయం అల్పాహారం అందించే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు. లయన్స్ క్లబ్ సభ్యుల జన్మదినాలు, శుభకార్యాల సందర్భంగా వందలాది మందికి అల్పాహారం అందిస్తున్నామని చెప్పారు.

లయన్స్ క్లబ్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను చూసి పట్టణ ప్రజలు కూడా స్ఫూర్తి పొందుతున్నారని, తమ కుటుంబ సభ్యుల జన్మదినాలు, ఇతర శుభ సందర్భాల్లో పేదలకు ఉచితంగా అల్పాహారం అందించేందుకు ముందుకు వస్తున్నారని తెలిపారు.
“అన్నం పరబ్రహ్మ స్వరూపం. ప్రతి ఒక్కరూ తమకు వీలైన సందర్భంలో అన్నదానం చేయాలి” అని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ ప్రెసిడెంట్ లయన్ గుద్దేటి జంగయ్య, ప్రధాన కార్యదర్శి లయన్ కాశిరెడ్డి రవీందర్ రెడ్డి, ట్రెజరర్ లయన్ చిలుకూరి కాశీనాథ్, జోన్ చైర్మన్ గాజుల ఉషారాణి రాజేష్, లయన్స్ సభ్యులు లకుమారపు మల్లయ్య, నీల బుచ్చయ్య, వనం శ్రీనివాసులు, అవిరినేని వెంకటేశ్వరరావు, జెల్ల భాస్కర్, అలుగువెల్లి జైపాల్ రెడ్డి, సముద్రాల ఆనంద్, దినేష్ తదితరులు పాల్గొన్నారు.



Musini.Anjan





Leave a Reply