మాజీ జెడ్పీటీసీ నాగినేని జగన్మోహన్రావు రూ.10 వేలు
మాజీ సర్పంచ్ వకుళారాణి–శంకర్ దంపతులు రూ.10 వేలు అందజేత
ముత్తారం, సెప్టెంబర్ 23 (ప్రతినిధి): ముత్తారం మండల కేంద్రంలోని కుమ్మరిపల్లె యూత్ సభ్యులు ఏర్పాటు చేసిన గణేశ్ మండపానికి డీజే బాక్స్‌ల కోసం మొత్తం రూ.20 వేల ఆర్థిక సహాయం అందించారు.
మాజీ జెడ్పీటీసీ నాగినేని జగన్మోహన్రావు రూ.10 వేలు, ముత్తారం మాజీ సర్పంచ్ తాటిపాముల వకుళారాణి–శంకర్ దంపతులు రూ.10 వేలు చొప్పున విరాళంగా అందజేశారు. గణేశ్ మండపం వద్ద యూత్ సభ్యులకు ఈ నగదును అందించారు.
ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ గణేశ్ ఉత్సవాల నిర్వహణకు ఆర్థిక సహాయం అందించిన నాగినేని జగన్మోహన్రావు, తాటిపాముల వకుళారాణి–శంకర్ దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారంతో గణేశ్ ఉత్సవాలను ఘనంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ముత్తారం మండల వార్డు సభ్యుల ఫోరం అధ్యక్షుడు కుక్కల చంద్రమౌళితో పాటు పలువురు యూత్ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.
అయుష్ 24 న్యూస్
The Voice of Truth










Leave a Reply