Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు
Home › బ్రేకింగ్ న్యూస్ › కొట్టారా.. కొట్టు.. ఉట్టిని కొట్టు!
బ్రేకింగ్ న్యూస్

కొట్టారా.. కొట్టు.. ఉట్టిని కొట్టు!

12:00 మధ్యాహ్నం PM

అయ్యప్ప నగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఉత్సాహంగా ఉట్లు కొట్టిన రాధాకృష్ణులు

దేవరకొండ, సెప్టెంబర్ 21 (ప్రతినిధి):

గోకులంలో శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి ఉట్లు కొట్టే సన్నివేశాన్ని తలపించేలా దేవరకొండ పట్టణంలోని అయ్యప్ప నగర్‌లో చిన్నారులు రాధాకృష్ణుల వేషధారణలో ఉట్లు కొట్టి సందడి చేశారు. అయ్యప్ప నగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి నిర్వహించిన ఉట్ల సంబరాలు భక్తిశ్రద్ధలతో పాటు ఉత్సాహభరితంగా సాగాయి.

ఉత్సవ నిర్వాహకులు ఉట్టిని పైకి లాగగా, అందంగా రాధాకృష్ణుల వేషధారణలో ముస్తాబైన చిన్నారులు గంతులు వేస్తూ ఉట్టిని కొట్టేందుకు ప్రయత్నించారు. చిన్నారుల సందడి, భక్తి భావంతో కూడిన ఈ వేడుక అక్కడికి వచ్చిన భక్తులు, స్థానికులను విశేషంగా ఆకట్టుకుంది.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. హోలీ, మహిళా దినోత్సవం, సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు వంటి కార్యక్రమాలతో పాటు గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని కూడా అందరూ కలిసి భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

రాధాకృష్ణుల వేషధారణలో చిన్నారులను చూసి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. చిన్నారులు ఉట్లు కొడుతూ సందడి చేస్తున్న దృశ్యాలను తల్లిదండ్రులు, భక్తులు తమ సెల్‌ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు.

అయ్యప్ప నగర్ గణేష్ మండపం వద్దకు ప్రతి సంవత్సరం విశేష సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారని నిర్వాహకులు తెలిపారు. ఉట్లు కొట్టిన చిన్నారులకు అనంతరం బహుమతులను అందజేశారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 164🔗 Shares: 4👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
219 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App