కులమతాలకు అతీతంగా లడ్డూ దక్కించుకున్న మహమ్మద్ షఫీ
దేవరకొండలో మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిన లడ్డూ వేలం
దేవరకొండ, అక్టోబర్ 04, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
దేవరకొండ పట్టణంలోని స్థానిక మార్కెట్ యార్డు సమీపంలో ఈశ్వర పుత్ర యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన భారీ గణనాథుడి లడ్డూ వేలంపాట ఉత్సాహభరిత వాతావరణంలో పోటాపోటీగా సాగింది.
గణనాథుడి లడ్డూను దక్కించుకోవాలన్న భక్తిభావంతో పలువురు వేలంలో పాల్గొనగా, మహమ్మద్ షఫీ తండ్రి తౌఫిక్ రూ.2,71,000కు లడ్డూను దక్కించుకున్నారు.
కులమత భేదాలకు అతీతంగా జరిగిన ఈ వేలం దేవరకొండలో భక్తి, సోదరభావం, మతసామరస్యానికి ప్రతీకగా నిలిచింది. లడ్డూ వేలంలో షఫీ పాల్గొనడం, వారి కుటుంబం లడ్డూను దక్కించుకోవడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.










Leave a Reply