Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు
Home › బ్రేకింగ్ న్యూస్ › గాంధీనగర్‌లో 24 అడుగుల భారీ వినాయకుడిని దర్శించుకున్న ఎమ్మెల్యే బాలు నాయక్
బ్రేకింగ్ న్యూస్

గాంధీనగర్‌లో 24 అడుగుల భారీ వినాయకుడిని దర్శించుకున్న ఎమ్మెల్యే బాలు నాయక్

03:56 మధ్యాహ్నం PM

దేవరకొండ, సెప్టెంబర్ 21 (ప్రతినిధి): దేవరకొండ పట్టణంలోని గాంధీనగర్‌లో ఈశ్వర పుత్ర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 24 అడుగుల భారీ వినాయక విగ్రహాన్ని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ సోమవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఏడో వార్డు కౌన్సిలర్, గణేష్ ఉత్సవ నిర్వాహకుల ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే బాలు నాయక్ మున్సిపల్ చైర్‌పర్సన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు, నాయకులతో కలిసి గణేష్ మండపానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్‌పర్సన్, కౌన్సిలర్లు, నాయకులను శాలువాలతో సత్కరించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ.. వినాయకుడి కరుణాకటాక్షాలు నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు బాగా పండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.

24 అడుగుల భారీ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సాధారణ విషయం కాదని, యువత ఐక్యంగా ముందుకు వచ్చి ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. ఉత్సవ నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు.

నిమజ్జనానికి పూర్తి సహకారం అందిస్తా: ఎమ్మెల్యే

వినాయక నిమజ్జనం ప్రశాంతమైన వాతావరణంలో జరిగేలా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. నిమజ్జనం సమయంలో ఏవైనా సమస్యలు ఎదురైతే తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు.

నిమజ్జనం సందర్భంగా పోలీసు, విద్యుత్, మున్సిపల్ తదితర శాఖల అధికారులు చెరువు వద్ద పర్యవేక్షణ చేస్తారని తెలిపారు. భారీ వినాయక విగ్రహం పట్టణంలోని పురవీధుల గుండా వెళ్లనున్న నేపథ్యంలో అవసరమైన సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.

అన్ని మండపాల నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొంటా

దేవరకొండ పట్టణంలో బుధవారం జరగనున్న వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో, ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించాలని ఎమ్మెల్యే బాలు నాయక్ కోరారు. నిమజ్జన కార్యక్రమాల్లో పోలీసు, మున్సిపల్, విద్యుత్ శాఖల అధికారులు సమన్వయంతో పర్యవేక్షించాలని తెలిపారు.

తనకు ఆహ్వానం అందిన మేరకు పట్టణంలోని వివిధ వినాయక మండపాల నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొంటానని ఎమ్మెల్యే తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్ పున్న వెంకటేశ్వర్లు, 8వ వార్డు కౌన్సిలర్ కేతావత్ అజయ్ చంద్ర, 7వ వార్డు కౌన్సిలర్ హనుమంతు సాయి చంద్ర గౌడ్, పాపా నాయక్, నారాయణ నాయక్, న్యాయవాది మాడెం రాములు యాదవ్, శంకర్ నాయక్, ఈశ్వర పుత్ర యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు గంజి సాయి కుమార్, ప్రధాన కార్యదర్శి షఫీ, కోశాధికారి గంజి వంశీ, తన్నీరు చంటి, అంబటి మహేష్, కాసుల వంశీ, ఏలే అరుణ్, వి. రాజు, బొడ్డుపల్లి హరీష్, మాడెం మంజునాథ్, మాడెం ఆదిత్య, గోగిక ఆకాష్, గోగి కార్ రాకేష్‌తో పాటు మహిళలు, యువత, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 292🔗 Shares: 6👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
219 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App