సత్యం, అహింస మార్గంలో సమాజం శాంతి, ఐకమత్యంతో ముందుకు సాగాలి: మాస్టర్ అహ్మద్ ఖాన్
షాద్నగర్, అక్టోబర్ 02, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
గాంధీ జయంతి సందర్భంగా షాద్నగర్ పట్టణంలోని సత్యనారాయణ టెంపుల్ వద్ద న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీకి ఘనంగా నివాళులర్పించారు.
అకాడమీ మాస్టర్ అహ్మద్ ఖాన్ ఆధ్వర్యంలో కుంగ్ ఫు విద్యార్థులు మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మాస్టర్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ సత్యం, అహింసలను ఆయుధాలుగా చేసుకుని చరిత్రపై చెరగని ముద్ర వేసిన మహాత్మా గాంధీకి ఘన నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. గాంధీజీ చూపిన మార్గంలో నడుస్తూ సమాజం శాంతి, ఐకమత్యం వైపు ముందుకు సాగాలని ఆకాంక్షించారు.










Leave a Reply