సోలిడార్ మూగ చెవిటి పాఠశాల విద్యార్థులకు అన్నదానం
కొండమల్లేపల్లి, అక్టోబర్ 04, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
హైదరాబాద్కు చెందిన గుర్రం సాయి తేజ, పద్మజ దంపతుల కుమారుడు గుర్రం విశ్వలోచన జన్మదినాన్ని పురస్కరించుకొని కొండమల్లేపల్లి మండలంలోని సోలిడార్ మూగ చెవిటి పాఠశాల విద్యార్థులకు ఆదివారం మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు సైగల భాషలో విశ్వలోచనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ దార్ల భాస్కర్ మాట్లాడుతూ, విద్యకు వైకల్యం అడ్డుకాకూడదని అన్నారు. సాధారణ విద్యార్థులతో సమానంగా మూగ చెవిటి విద్యార్థులు కూడా లక్ష్యసాధన దిశగా ముందుకు సాగుతున్నారని తెలిపారు.

విద్యార్థులు సమాజంలోని అందరితో సమానంగా అన్ని రంగాల్లో రాణించేందుకు విద్యను అభ్యసిస్తూ చురుకైన పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. వారి ఉజ్వల భవిష్యత్తుకు సమాజం అండగా నిలవాలని కోరారు. సంపాదనలో కొంత భాగాన్ని ఇటువంటి విద్యార్థుల సంక్షేమానికి వెచ్చిస్తూ దాతృత్వాన్ని చాటుకోవాలని సూచించారు.
పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, ఇతర ముఖ్యమైన సందర్భాల్లో విద్యార్థులకు భోజనం అందించడం వంటి సేవా కార్యక్రమాలు చేపట్టాలని దార్ల భాస్కర్ కోరారు.
కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎస్. సురేష్, తిరుపతి, కిషోర్, కవిత, ముసిని అంజన్, పగిడిమర్రి యాదగిరి, బత్తుల సురేష్, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply