ముఖంపై భారీగా పెరిగిన గడ్డ.. పశువైద్యులు స్పందించాలని విజ్ఞప్తి
గోదావరిఖని, సెప్టెంబర్ 23 (ప్రతినిధి):
గోదావరిఖని పట్టణంలో గత కొన్ని రోజులుగా ఓ మూగజీవి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు స్థానికులు తెలిపారు. చౌరస్తా నుంచి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ వరకు రోడ్డు పరిసరాల్లో సంచరిస్తున్న ఈ జంతువు ముఖంపై పెద్ద గడ్డ ఏర్పడి, రోజురోజుకూ అది పెరుగుతున్నట్లు పేర్కొన్నారు.
గడ్డ భారీగా పెరగడంతో ఆ మూగజీవి నడవడానికి, ఆహారం తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలిసిన వారు వెంటనే పశువైద్యులు స్పందించి జంతువును పరిశీలించి అవసరమైన వైద్యం అందించాలని కోరుతున్నారు.
మానవతా దృక్పథంతో పశువైద్యులు, సంబంధిత అధికారులు స్పందించి మూగజీవికి చికిత్స అందించి ప్రాణాలను కాపాడాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
“మాటలేని జీవికి మనమే గొంతుక అవుదాం.. ఒక ప్రాణాన్ని కాపాడేందుకు మనవంతు సహాయం చేద్దాం.” 🙏










Leave a Reply