చిట్యాల, అక్టోబర్ 16 (ఆయుష్ 24 న్యూస్): చిట్యాల పట్టణంలోని పలు అమ్మవార్ల ఆలయాలను తెలంగాణ రాష్ట్ర మాజీ డైరీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి సందర్శించి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
చిట్యాల పట్టణంలోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయం, అంబేద్కర్ నగర్లోని శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం, 10వ వార్డులోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంతో పాటు, 12వ వార్డులో యువసేన యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయ పూజా కార్యక్రమాల్లో ఆయన పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరియాలని, ప్రజలందరిపై అమ్మవార్ల చల్లని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని గుత్తా అమిత్ రెడ్డి మనస్ఫూర్తిగా ప్రార్థించారు.
ఆయుష్ 24 న్యూస్ | చిట్యాల
చిట్యాలలో అమ్మవార్ల ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన గుత్తా అమిత్ రెడ్డి
చిట్యాల, అక్టోబర్ 16 (ఆయుష్ 24 న్యూస్): చిట్యాల పట్టణంలోని పలు అమ్మవార్ల ఆలయాలను తెలంగాణ రాష్ట్ర మాజీ డైరీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి సందర్శించి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చిట్యాల పట్టణంలోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయం, అంబేద్కర్ నగర్లోని శ్రీ కనకదుర్గ అమ్మవారి


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →








Leave a Reply