చందంపేట: మండలంలోని చిత్రియాల గ్రామంలో విజయదశమి (దసరా) పండుగ సందర్భంగా నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో జాలే బ్రదర్స్ నరసింహారెడ్డి, తిలక్ రెడ్డి పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన బతుకమ్మ పోటీల్లో మొదటి బహుమతిని కొండోజు స్వప్న, రెండో బహుమతిని బికుమల్ల ధనమ్మ, మూడో బహుమతిని కూరెళ్ల లక్ష్మమ్మ గెలుచుకున్నారు. వీరికి జాలే బ్రదర్స్ నరసింహారెడ్డి, తిలక్ రెడ్డి బహుమతులు అందజేసి అభినందించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆటల్లో గెలుపోటములు సహజమని, గ్రామంలోని ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ నగదు బహుమతులు అందజేసినట్లు తెలిపారు. దీంతో గ్రామ ప్రజల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను గ్రామస్థులందరూ కలిసి ఘనంగా జరుపుకోవడం విశేషం.
ఈ కార్యక్రమంలో చిత్రియాల గ్రామంతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Ayush 24 News
చిత్రియాలలో ఘనంగా విజయదశమి బతుకమ్మ వేడుకలు.. విజేతలకు బహుమతులు అందజేసిన జాలే బ్రదర్స్ నరసింహారెడ్డి, తిలక్ రెడ్డి
చందంపేట: మండలంలోని చిత్రియాల గ్రామంలో విజయదశమి (దసరా) పండుగ సందర్భంగా నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో జాలే బ్రదర్స్ నరసింహారెడ్డి, తిలక్ రెడ్డి పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బతుకమ్మ పోటీల్లో మొదటి బహుమతిని కొండోజు స్వప్న, రెండో బహుమతిని బికుమల్ల ధనమ్మ, మూడో బహుమతిని


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →








Leave a Reply