Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి
Home › రాజకీయాలు › జ్ఞానేష్ కుమార్ ఏకపక్ష వైఖరి సరికాదు: యువజన కాంగ్రెస్ నల్గొండ జిల్లా కార్యదర్శి మేడ సైదులు’ ధ్వజం
రాజకీయాలు

జ్ఞానేష్ కుమార్ ఏకపక్ష వైఖరి సరికాదు: యువజన కాంగ్రెస్ నల్గొండ జిల్లా కార్యదర్శి మేడ సైదులు’ ధ్వజం

కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఏకపక్ష, నియంతృత ధోరణిని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రముఖ నాయకులు మేడ సైదులు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ దేశంలో ధనిక, పేద, కుల, మత వ్యత్యాసాలు లేకుండా పౌరులందరికీ రాజ్యాంగం సమానంగా కల్పించిన ఏకైక ఏకైక ప్రాథమిక హక్కు

01:00 మధ్యాహ్నం PM

కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఏకపక్ష, నియంతృత ధోరణిని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రముఖ నాయకులు మేడ సైదులు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ దేశంలో ధనిక, పేద, కుల, మత వ్యత్యాసాలు లేకుండా పౌరులందరికీ రాజ్యాంగం సమానంగా కల్పించిన ఏకైక ఏకైక ప్రాథమిక హక్కు ఓటు హక్కు మాత్రమేనని ఆయన గుర్తుచేశారు. అలాంటి పవిత్రమైన హక్కును ఎస్సీ, బీసీ, మైనార్టీ, దళిత వర్గాలు మరియు మహిళల నుండి పరోక్షంగా లాక్కోవడానికి, వారి ఓట్లను జాబితాల నుండి తొలగించడానికి పట్రాంగం జరుగుతోందని, ఈ రకమైన ధోరణి ఎంతమాత్రం మంచిది కాదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశంలో రాజ్యాంగ శిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ప్రసాదించిన ఓటు హక్కు ద్వారానే బహుజనులు, మహిళలు రాజకీయ ప్రాతినిధ్యాన్ని పొందుతున్నారని, ప్రస్తుత పరిణామాల్లో సర్వేలు, జాబితాల సవరణల పేరుతో క్షేత్రస్థాయిలోని బలహీన వర్గాల ఓట్లను మాయం చేసే ప్రయత్నాలు సాగుతున్నాయని ఆయన విమర్శించారు. ఎన్నికల నిర్వహణ వ్యవస్థ ప్రజాస్వామ్యబద్ధంగా నడవాల్సింది పోయి, ఏకపక్ష నిర్ణయాలతో విశ్వసనీయతను దెబ్బతీస్తోందని, నిరుపేదల, వెనుకబడిన వర్గాల ఓటు హక్కును కాలరాసే ఏ ప్రయత్నాన్నైనా అడ్డుకుంటామని తేల్చిచెప్పారు. అధికారికంగా తొలగించిన పౌరుల ఓట్లను తక్షణమే పునరుద్ధరించాలని, ఎన్నికల కమిషన్ తన ఏకపక్ష వైఖరిని మార్చుకోకపోతే దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యవాదులు, ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని మేడ సైదులు హెచ్చరించారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 33🔗 Shares: 2👍 Likes: 1
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
15 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App