దేవరకొండకు చెందిన సీనియర్ నాయకుడికి కీలక బాధ్యతలు
నియామకాన్ని ప్రకటించిన టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
పార్టీ బలోపేతానికి జిల్లా వ్యాప్తంగా కృషి చేయాలని సూచన
దేవరకొండ, అక్టోబర్ 21, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
టీఆర్ఎస్ నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా దేవరకొండ పట్టణానికి చెందిన సీనియర్ నాయకుడు లకుమారపు మల్లయ్య నియమితులయ్యారు. ఈ మేరకు టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఒక ప్రకటనలో వెల్లడించారు.
మల్లయ్య సేవలు పార్టీకి అవసరం: కల్వకుంట్ల కవిత
ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ, తెలంగాణ జాగృతిలో లకుమారపు మల్లయ్య కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. సుదీర్ఘకాలంగా తనతో కలిసి పనిచేస్తున్న మల్లయ్య సేవలు టీఆర్ఎస్ పార్టీకి ఎంతో అవసరమని తెలిపారు.
భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా పార్టీ అభివృద్ధి, బలోపేతం కోసం కృషి చేయాలని సూచించారు.
కల్వకుంట్ల కవితకు మల్లయ్య కృతజ్ఞతలు
తనపై నమ్మకంతో టీఆర్ఎస్ నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించిన రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు లకుమారపు మల్లయ్య కృతజ్ఞతలు తెలిపారు.
తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని, పార్టీ నాయకత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని స్పష్టం చేశారు.
నల్లగొండ జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి, పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తానని మల్లయ్య తెలిపారు.
AYUSH24 NEWS | The Voice of Truth










Leave a Reply