Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి
Home › బ్రేకింగ్ న్యూస్ › టీజేజేఏసీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా చేరాల రవీందర్ నియామకం
బ్రేకింగ్ న్యూస్

టీజేజేఏసీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా చేరాల రవీందర్ నియామకం

02:46 తెల్లవారుజాము AM

జర్నలిస్టులకు గవర్నర్ కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు కేటాయించాలి: రాష్ట్ర చైర్మన్ తొగరి కరుణాకర్

మంథని, సెప్టెంబర్ 22 (ప్రతినిధి): తెలంగాణ జర్నలిస్టు జాయింట్ యాక్షన్ కమిటీ (టీజేజేఏసీ) విస్తరణలో భాగంగా పలు జిల్లాలకు నూతన అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను రాష్ట్ర కమిటీ ప్రకటించింది. రాష్ట్ర చైర్మన్ తొగరి కరుణాకర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా చేరాల రవీందర్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల గణేష్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా మూడు జిల్లాల అధ్యక్షులు, నాలుగు జిల్లాల ప్రధాన కార్యదర్శులను నియమించినట్లు టీజేజేఏసీ రాష్ట్ర కమిటీ తెలిపింది. మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడిగా తక్కళ్లపల్లి శ్రీనివాస్, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా మందుల బాలకృష్ణ నియమితులయ్యారు.

అదేవిధంగా భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శిగా కొండం నాగరాజు, కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఖాజా గౌస్ ఉద్దీన్, నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా అనగందుల సతీష్, సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా నాయికిని జనార్దన్ నియమితులయ్యారు.

ఈ సందర్భంగా రాష్ట్ర చైర్మన్ తొగరి కరుణాకర్ మాట్లాడుతూ.. సమాజ సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తూ, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టులకు తగిన గుర్తింపు, న్యాయం లభించడం లేదని అన్నారు. వివిధ రంగాలకు శాసనమండలిలో ప్రాతినిధ్యం ఉన్నట్లుగానే, జర్నలిస్టుల సమస్యలను శాసనమండలిలో ప్రస్తావించేందుకు గవర్నర్ కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలను జర్నలిస్టులకు కేటాయించాలని డిమాండ్ చేశారు.

ఎమ్మెల్సీ స్థానాల సాధనే లక్ష్యంగా జర్నలిస్టులంతా టీజేజేఏసీ ఆధ్వర్యంలో ఐక్యంగా ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. త్వరలో హైదరాబాద్ వేదికగా నిర్వహించనున్న ‘జర్నలిస్టుల సమరభేరి’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

పెద్దపల్లి జిల్లా అధ్యక్ష బాధ్యతలు తనపై నమ్మకంతో అప్పగించిన రాష్ట్ర చైర్మన్ తొగరి కరుణాకర్‌తో పాటు రాష్ట్ర నాయకత్వానికి చేరాల రవీందర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.

— AYUSH24 NEWS
The Voice of Truth

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 18🔗 Shares: 1👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
366 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App