టేకులపల్లి, సెప్టెంబర్ 21 (ప్రతినిధి): టేకులపల్లి బోడు ఎక్స్ రోడ్డు (కుప్పుస్వామి కాలనీ)లో నిర్వహిస్తున్న వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఘనంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకు ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు శ్రీమతి కోరం ఉమా–సురేందర్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించి, భక్తులతో కలిసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
అన్నదాన కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రసాదాన్ని స్వీకరించారు. ఉత్సవ కమిటీ సభ్యులు కార్యక్రమాన్ని నిర్వహించారు.










Leave a Reply