Breaking News
TAIKA ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్–2026 బ్రోచర్‌ను ఆవిష్కరించిన సినీ నటుడు డాక్టర్ సుమన్

హైదరాబాద్: సెప్టెంబర్ 5, 6 తేదీల్లో గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరగనున్న TAIKA ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్–2026 బ్రోచర్‌ను ప్రముఖ సినీ నటుడు డాక్టర్ సుమన్ తల్వార్ ఆవిష్కరించారు. కూకట్‌పల్లి వివేకానంద నగర్‌లోని ట్రైకా మార్షల్ ఆర్ట్స్ అకాడమీలో బుధవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని బ్రోచర్‌ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ సుమన్ మాట్లాడుతూ, మార్షల్ ఆర్ట్స్ యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, శారీరక దృఢత్వాన్ని పెంపొందించే గొప్ప విద్య అని పేర్కొన్నారు. ఇటువంటి జాతీయ స్థాయి పోటీలు మరింత విస్తృతంగా నిర్వహించడం ద్వారా ప్రతిభావంతులైన క్రీడాకారులకు మంచి అవకాశాలు లభిస్తాయని అన్నారు.

ట్రైకా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకుడు, చీఫ్ ఇన్‌స్ట్రక్టర్ డాక్టర్ అశోక్ చక్రవర్తి మాట్లాడుతూ, దేశంలోని 10 రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు ఈ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొననున్నట్లు తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు ఆగస్టు 20వ తేదీలోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.

విజేతలకు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్ మరియు ప్రముఖ సినీ నటుడు డాక్టర్ సుమన్ చేతుల మీదుగా పతకాలు, ప్రశంసాపత్రాలు అందజేయనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో శ్వేత, నవత, మానస, అనిల్, సందీప్, దినేష్, మణికంఠతో పాటు పలువురు తల్లిదండ్రులు, క్రీడాకారులు, మార్షల్ ఆర్ట్స్ శిక్షకులు పాల్గొన్నారు.

ఫోటో క్యాప్షన్:
ట్రైకా ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్–2026 బ్రోచర్‌ను ఆవిష్కరిస్తున్న ప్రముఖ సినీ నటుడు డాక్టర్ సుమన్ తల్వార్.

— AYUSH 24 NEWS | The Voice of Truth

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *