డిండి, సెప్టెంబర్ 26: డిండి మండల ప్రజలు, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని డిండి ఆయకట్టుకు వెంటనే సాగునీరు అందించేలా చర్యలు చేపట్టాలని కోరుతూ డిండి మండల అధ్యక్షుడు ముత్యాల శశిధర్ రెడ్డి, డిండి మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొంతినేని వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మండలంలోని సర్పంచులు, సీపీఐ నాయకులు అచ్చంపేట ఎమ్మెల్యే శ్రీ చిక్కుడు వంశీకృష్ణను కలిసి వినతిపత్రం అందజేశారు.
డిండి ప్రాజెక్టుకు నీరు అందకపోవడంతో ఆయకట్టు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. పంటలకు సాగునీరు అందేలా తక్షణ చర్యలు చేపట్టి డిండి ఆయకట్టును నీటితో నింపాలని కోరారు.
ఈ సందర్భంగా అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి డిండి ఆయకట్టుకు నీరు అందించే అంశంపై దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్, తనకు సూచనలు ఇచ్చారని తెలిపారు. ఇరిగేషన్ అధికారులతో ఇప్పటికే మాట్లాడినట్లు పేర్కొన్నారు. రాబోయే రెండు మూడు రోజుల్లో డిండి ప్రాజెక్టుకు నీరు అందించే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నామని వెల్లడించారు.
డిండి ప్రాంత రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పంటలకు అవసరమైన నీరు అందేలా సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తామని తెలిపారు.
ఈ విషయాన్ని డిండి మండల సర్పంచులు గ్రామ ప్రజలకు వివరించి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అందరూ సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు తుమ్మ బుచ్చిరెడ్డి, మైనోద్దీన్, శైలేష్, కొర్ర రవి, తుమ్మ వెంకట్, నారాయణరెడ్డి, బాదమోని శ్రీను, ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
— Ayush 24 News
The Voice of Truth
డిండి ఆయకట్టుకు వెంటనే సాగునీరు అందించాలి అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణకు డిండి మండల సర్పంచుల వినతి
డిండి, సెప్టెంబర్ 26: డిండి మండల ప్రజలు, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని డిండి ఆయకట్టుకు వెంటనే సాగునీరు అందించేలా చర్యలు చేపట్టాలని కోరుతూ డిండి మండల అధ్యక్షుడు ముత్యాల శశిధర్ రెడ్డి, డిండి మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొంతినేని వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మండలంలోని సర్పంచులు, సీపీఐ


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →








Leave a Reply