టేకులపల్లి, సెప్టెంబర్ 17, అయుష్ 24 న్యూస్ ప్రతినిధి :: టేకులపల్లి గ్రామ పంచాయతీకి చెందిన మూతి శ్రీను ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కోరం సురేందర్ వారి కుటుంబాన్ని పరామర్శించారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యుల పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఆయన, మృతుడి కుమారుడికి ధైర్యం చెప్పారు. కుటుంబానికి ₹10,000 ఆర్థిక సహాయం అందించారు.

భవిష్యత్తులో అవసరమైన సహాయం అందించేందుకు అండగా ఉంటామని కోరం సురేందర్ తెలిపారు. బాలుడు ధైర్యంగా ఉండి చదువుపై దృష్టి సారించి జీవితంలో ముందుకు సాగాలని సూచించారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
— అయుష్ 24 న్యూస్ ప్రతినిధి :










Leave a Reply