శాలిగౌరారం మండలం వల్లాల గ్రామంలో తెలంగాణ విలీన దినోత్సవ వేడుకలు
శాలిగౌరారం, సెప్టెంబర్ 17: తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా శాలిగౌరారం మండలం వల్లాల గ్రామంలో తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘాల ముఖ్య సలహాదారు వి. హనుమంతరావు, తెలంగాణ రాష్ట్ర మాజీ శాసన మండలి చైర్మన్ నేతి విద్యాసాగర్, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం వారు తెలంగాణ సమాజం కోసం ప్రాణత్యాగం చేసిన విద్యార్థులు, ఉద్యమకారుల సేవలను స్మరించుకున్నారు. వారి త్యాగాలను గుర్తు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
— ఆయుష్ 24 న్యూస్ ప్రతినిధి










Leave a Reply