మహాసభను విజయవంతం చేయాలని చైర్మన్ చేరుపల్లి బాలరాజు పిలుపు
దేవరకొండ, సెప్టెంబర్ 23 (ప్రతినిధి):
దేవరకొండ పట్టణంలోని చేనేత సహకార సంఘం మహాసభ ఈ నెల 26న శనివారం ఉదయం 10 గంటలకు సంఘ భవనంలో నిర్వహించనున్నట్లు చేనేత సహకార సంఘం చైర్మన్ చేరుపల్లి బాలరాజు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంఘం మహాసభకు సభ్యులందరూ తప్పక హాజరై విజయవంతం చేయాలని కోరారు. మహాసభలో సంఘం వార్షిక బడ్జెట్తో పాటు పలు ఇతర తీర్మానాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలిపారు.
ఈ మహాసభకు ముఖ్య అతిథులుగా పద్మశాలి నిత్య అన్నదాన సత్రాల మార్గదర్శకులు చిలువేరు కాశీనాథ్, చేనేత సహకార సంఘం ఏ.డి. పి. గోవిందయ్య, దేవరకొండ మున్సిపల్ చైర్పర్సన్ పున్న శైలజ, దేవరకొండ చేనేత సహకార సంఘం మాజీ అధ్యక్షులు, పట్టణ మాజీ సర్పంచ్ పున్న వెంకటేశ్వర్లు హాజరుకానున్నట్లు చైర్మన్ బాలరాజు తెలిపారు.
సంఘ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించనున్నందున సభ్యులందరూ సమయానికి హాజరై మహాసభను విజయవంతం చేయాలని ఆయన కోరారు.










Leave a Reply