దేవరకొండ, అక్టోబర్ 27, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
దేవరకొండ పట్టణంలో ఐఎన్టీయూసీ 327 యూనియన్ 73వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక యూనియన్ కార్యాలయంలో ఐఎన్టీయూసీ నల్లగొండ జిల్లా సెక్రటరీ నిరంజన్ అలీ యూనియన్ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా నిరంజన్ అలీ మాట్లాడుతూ, కార్మికుల సమస్యల పరిష్కారానికి ఐఎన్టీయూసీ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. కార్మికులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా వారికి అండగా నిలిచి, సమస్యల పరిష్కారానికి ముందుంటామని పేర్కొన్నారు.
కార్మికుల హక్కుల పరిరక్షణతో పాటు వారి సంక్షేమం, అభివృద్ధికి యూనియన్ కట్టుబడి ఉందన్నారు. కార్మికుల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి సంబంధిత వర్గాల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.
యూనియన్ ఆశయాలు, లక్ష్యాలను వివరిస్తూ సంస్థను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని నిరంజన్ అలీ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బి. రవి, రాంబాబు, కోర్ర విజయ్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply