Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి
Home › బ్రేకింగ్ న్యూస్ › దేవరకొండ మైత్రి థియేటర్ వద్ద పార్కింగ్ కష్టాలు
బ్రేకింగ్ న్యూస్

దేవరకొండ మైత్రి థియేటర్ వద్ద పార్కింగ్ కష్టాలు

05:36 తెల్లవారుజాము AM

రోడ్లు, ఫుట్‌పాత్‌లపైనే వాహనాల నిలిపివేత.. పాదచారులు, స్కూల్ పిల్లలకు ఇబ్బందులు

దేవరకొండ, సెప్టెంబర్ 25 (ప్రతినిధి): దేవరకొండ పట్టణంలోని మైత్రి థియేటర్ వద్ద పార్కింగ్ సమస్యతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా కొత్త సినిమాలు విడుదలైన సమయంలో థియేటర్ పరిసరాల్లో వాహనాల రద్దీ మరింత పెరుగుతోందని పేర్కొంటున్నారు.

థియేటర్‌కు వచ్చే వాహనాలను రోడ్లు, ఫుట్‌పాత్‌లపై నిలిపివేస్తుండటంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. థియేటర్ సమీపంలో ప్రమాదకరమైన మలుపు ఉండటం, దానికి తోడు వాహనాలను అడ్డదిడ్డంగా నిలిపివేయడం వల్ల ఎదురుగా వచ్చే వాహనాలు సరిగా కనిపించక ప్రమాదాలకు ఆస్కారం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఫుట్‌పాత్‌లపై వాహనాలు నిలిపివేయడంతో పాదచారులు రోడ్డుపైకి వచ్చి నడవాల్సిన పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. ఈ మార్గంలో రాకపోకలు సాగించే స్కూల్ విద్యార్థులు, చిన్నారులు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు పేర్కొన్నారు.

కొత్త సినిమా విడుదలైన ప్రతిసారీ ఇదే పరిస్థితి పునరావృతమవుతోందని వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సరిపడా పార్కింగ్ సదుపాయం లేకుండా థియేటర్ నిర్వహణ ఎలా కొనసాగుతోందని ప్రశ్నిస్తున్నారు.

ఈ సమస్యను పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా శాశ్వత పరిష్కారం లభించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మున్సిపల్, పోలీస్ అధికారులు స్పందించి ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టడంతో పాటు వాహనాల కోసం క్రమబద్ధమైన పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.

ప్రమాదాలు చోటుచేసుకోకముందే అధికారులు రంగంలోకి దిగి మైత్రి థియేటర్ వద్ద పార్కింగ్, ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

— ఆయుష్ 24 న్యూస్

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 26🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
671 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App