Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి● నవంబర్ 6లోగా పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి● బీసీల రాజ్యాధికారమే మా ధ్యేయం: తీన్మార్ మల్లన్న● దేవరకొండ నియోజకవర్గంలో రేపు ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన● రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడిని పరామర్శించిన ఎమ్మెల్యే బాలు నాయక్● సిటీ సివిల్ కోర్టును సందర్శించిన MSS లా కళాశాల విద్యార్థులు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి● నవంబర్ 6లోగా పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి● బీసీల రాజ్యాధికారమే మా ధ్యేయం: తీన్మార్ మల్లన్న● దేవరకొండ నియోజకవర్గంలో రేపు ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన● రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడిని పరామర్శించిన ఎమ్మెల్యే బాలు నాయక్● సిటీ సివిల్ కోర్టును సందర్శించిన MSS లా కళాశాల విద్యార్థులు
Home › బ్రేకింగ్ న్యూస్ › దేవరకొండ సబ్ కలెక్టర్ కు సమాచార హక్కు చట్టంపై వినతి పత్రం అందజేత
బ్రేకింగ్ న్యూస్

దేవరకొండ సబ్ కలెక్టర్ కు సమాచార హక్కు చట్టంపై వినతి పత్రం అందజేత

సమాచార హక్కు చట్టం పౌరుల చేతిలో బ్రహ్మాస్త్రం: ఆర్టీఐ ఆక్టివిస్ట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు డా. కొర్ర కిషన్ నాయక్ ఘనంగా ఆర్టీఐ చట్టం 21వ వార్షికోత్సవం ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకతను, జవాబుదారితనాన్ని పెంపొందించేలా సమాచార హక్కు చట్టం-2005ను కచ్చితంగా అమలు చేయాలని కోరుతూ ఆర్టీఐ ఆక్టివిస్ట్ సొసైటీ

03:36 మధ్యాహ్నం PM

సమాచార హక్కు చట్టం పౌరుల చేతిలో బ్రహ్మాస్త్రం: ఆర్టీఐ ఆక్టివిస్ట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు డా. కొర్ర కిషన్ నాయక్

ఘనంగా ఆర్టీఐ చట్టం 21వ వార్షికోత్సవం

ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకతను, జవాబుదారితనాన్ని పెంపొందించేలా సమాచార హక్కు చట్టం-2005ను కచ్చితంగా అమలు చేయాలని కోరుతూ ఆర్టీఐ ఆక్టివిస్ట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు డా. కొర్ర కిషన్ నాయక్ ఆధ్వర్యంలో దేవరకొండ సబ్ కలెక్టర్ కరోలిన్ చింగ్ తియాన్ మావికి ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు.
​ఈ సందర్భంగా డా. కిషన్ నాయక్ విలేకరులతో మాట్లాడుతూ… సమాచార హక్కు చట్టం పౌరుల చేతిలో బ్రహ్మాస్త్రం లాంటిదని, ప్రభుత్వ విధివిధానాలపై, పాలనపై ప్రజలకు అవగాహన కల్పించడంలో ఇది ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో చట్టంలోని సెక్షన్ 4(1)b ప్రకారం 17 అంశాలు మరియు సెక్షన్ 2(హెచ్) ప్రకారం విధిగా ఆర్టీఐ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కార్యాలయంలో ఏపీఐఓ (APIO), పీఐఓ (PIO), అప్పిలేట్ అధికారుల పేర్లను, ఫోన్ నెంబర్లను ఎప్పటికప్పుడు మార్పుచేర్పులతో ప్రదర్శించాలని, ఇన్వర్డ్, అవుట్వర్డ్ రిజిస్టర్లు పకడ్బందీగా నిర్వహించాలని ఆయన కోరారు.

​సమాచార హక్కు చట్టం (RTI) – నేపథ్యం:

దేశ ప్రజలకు ప్రభుత్వ శాఖల సమాచారాన్ని పారదర్శకంగా అందించే ఉద్దేశంతో పార్లమెంటు చట్టం ద్వారా 2005 అక్టోబర్ 12 నుండి ఇది అమల్లోకి వచ్చింది. ప్రభుత్వ పాలనలో జవాబుదారితనాన్ని పెంచి, అవినీతిని అరికట్టడంలో ఈ చట్టం కీలకపాత్ర పోషిస్తోంది. పౌరులు ఎవరైనా ప్రభుత్వ రంగ సంస్థలు లేదా శాఖల నుంచి నిర్ణీత కాలపరిమితిలోగా సమాచారాన్ని పొందేలా ఈ చట్టం పూర్తి హక్కు కల్పిస్తోంది. సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చి నేటితో 21 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ వినతిపత్రం అందజేయడం విశేషం.
​ఈ కార్యక్రమంలో ఆర్టీఐ ఆక్టివిస్ట్ సొసైటీ రాష్ట్ర కార్యదర్శి పులిజాల గోవర్ధన్, నాయకులు లవుడి భాషా నాయక్ తదితరులు పాల్గొన్నారు

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 34🔗 Shares: 1👍 Likes: 1
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
37 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App