నల్గొండ పట్టణంలోని ఆర్జాల బావి 17వ కార్పొరేషన్ పరిధిలోని ఇంద్రమ్మ కాలనీలో వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా ముగిశాయి. మైసమ్మ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్రహం వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించిన గణేశుని లడ్డు వేలం పాట స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో పాల్గొన్న ఈ లడ్డు వేలంపాటలో, పట్టణానికి చెందిన తులం సంతోష్ కుమార్ అత్యధికంగా రూ. 56,000 ధర పాడి లడ్డును సొంతం చేసుకున్నారు.
స్వామివారి లడ్డు దక్కించుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నట్లు సంతోష్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ శర్మ, పూజారి సిరి ప్రగడ,గజం శివ,వి. కిరణ్ కుమార్,గజం నాగరాజు,వి.రమేష్,మేకల రవికుమార్,కాలనీ వాసులు, మైసమ్మ యూత్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.
నల్గొండ పట్టణంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. ఆర్జాల బావి ఇంద్రమ్మ కాలనీలో రూ. 56,000 పలికిన లడ్డు!
నల్గొండ పట్టణంలోని ఆర్జాల బావి 17వ కార్పొరేషన్ పరిధిలోని ఇంద్రమ్మ కాలనీలో వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా ముగిశాయి. మైసమ్మ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్రహం వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించిన గణేశుని లడ్డు వేలం పాట స్థానికంగా


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →







Leave a Reply