నవంబర్ 2 నుంచి 5 వరకు భారత్ మండపంలో సదస్సు, ఎక్స్పో నిర్వహణ
మీడియాకు వివరాలు వెల్లడించిన కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంతోష్ కుమార్ సారంగి
న్యూఢిల్లీ, అక్టోబర్ 28, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
దేశ రాజధాని న్యూఢిల్లీలో భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ (BRE) సమ్మిట్ అండ్ ఎక్స్పో–2026 నిర్వహించనున్నట్లు కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఈ సదస్సు నవంబర్ 2 నుంచి 5, 2026 వరకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరగనుంది.
బుధవారం న్యూఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంతోష్ కుమార్ సారంగి ఈ సదస్సుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
నాలుగు రోజులపాటు జరగనున్న భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్ అండ్ ఎక్స్పో–2026 నిర్వహణకు సంబంధించిన సమాచారాన్ని ఆయన మీడియాకు వివరించారు.











Leave a Reply