ముత్తారం మండలం పారుపల్లి గ్రామానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు బియ్యని సాయికుమార్ జయంతి సందర్భంగా ఆయన వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని పుట్ట మధూకర్ ఆవిష్కరించారు. అనంతరం అక్కడ మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా పుట్ట మధూకర్ మాట్లాడుతూ, ఆర్ఎంపీ వైద్యుడిగా సాయికుమార్ గ్రామంలోని పేదలకు మంచి వైద్య సేవలు అందించి ప్రజల ఆదరాభిమానాలను పొందారని గుర్తు చేశారు. ప్రస్తుత కాలంలో అనేక వృత్తుల్లో ఆర్థిక ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్న పరిస్థితుల్లో, సాయికుమార్ మాత్రం ఎలాంటి స్వార్థం లేకుండా తనవంతు సేవలు అందించి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.
సాయికుమార్ సేవలు చిరస్మరణీయం
పేద ప్రజలకు ఆయన అందించిన సేవలు మరువలేనివని, సాయికుమార్ ఆశయాలు, ఆలోచనలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పుట్ట మధూకర్ పేర్కొన్నారు. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
సాయికుమార్ మరణం ఆయన కుటుంబానికే కాకుండా, ఆయన సేవలు పొందిన ప్రజలకు కూడా తీరని లోటని పేర్కొంటూ, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఆయుష్ 24 న్యూస్
ప్రజల గొంతుక – నిజం కోసం నిరంతరం
నిస్వార్థ సేవకుడు సాయికుమార్: మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్
ముత్తారం మండలం పారుపల్లి గ్రామానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు బియ్యని సాయికుమార్ జయంతి సందర్భంగా ఆయన వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని పుట్ట మధూకర్ ఆవిష్కరించారు. అనంతరం అక్కడ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పుట్ట మధూకర్ మాట్లాడుతూ, ఆర్ఎంపీ వైద్యుడిగా సాయికుమార్ గ్రామంలోని పేదలకు మంచి


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →








Leave a Reply