డిజిటల్ సాంకేతికతతో పర్యాటక రంగానికి కొత్త రూపు
హైదరాబాద్, సెప్టెంబర్ 26 (AYUSH24 News ప్రతినిధి): తెలంగాణ రాష్ట్ర పర్యాటక రంగాన్ని ఆధునిక సాంకేతిక హంగులతో తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. డిజిటల్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంతో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.
ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని మాదాపూర్ శిల్పారామంలో శనివారం ప్రత్యేక వేడుకలు నిర్వహించనున్నారు. పర్యాటక రంగంలో ఆధునిక సాంకేతికత వినియోగాన్ని ప్రధానాంశంగా చేసుకుని కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
భాషా సాంస్కృతిక శాఖ, పురావస్తు శాఖ, నిథమ్తో పాటు సాహిత్య, సంగీత, నాటక అకాడమీల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనున్నట్లు సమాచారం.
ఈ వేడుకలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరుకానున్నట్లు నిర్వాహక వర్గాల సమాచారం.
ఆయుష్ 24 న్యూస్ — The Voice of Truth










Leave a Reply