జిల్లా కలెక్టర్, ఎస్పీ, డీఎఫ్ఓ, ఇతర అధికారులతో సమీక్షా సమావేశం
పెద్దపల్లి, సెప్టెంబర్ 17, అయుష్ 24 న్యూస్: జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ (NCST) సభ్యులు శ్రీ జాటోతు హుస్సేన్ నాయక్ పెద్దపల్లి జిల్లాలో అధికారిక పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్, ఎస్పీ, డీఎఫ్ఓతో పాటు ఇతర జిల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో షెడ్యూల్డ్ తెగల (ST) ప్రజలకు సంబంధించిన వివిధ సమస్యలు, వారి చట్టపరమైన హక్కులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరు, పెండింగ్లో ఉన్న భూ సమస్యల పరిష్కారం తదితర అంశాలపై సుదీర్ఘంగా సమీక్షించారు.
అలాగే జిల్లాలో గిరిజనుల సమగ్ర అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. అర్హులైన గిరిజనులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
గిరిజనుల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారి హక్కులు, సంక్షేమం, అభివృద్ధికి సంబంధించిన అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఈ సందర్భంగా సూచించారు.

— అయుష్ 24 న్యూస్
The Voice of Truth










Leave a Reply