Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి
Home › బ్రేకింగ్ న్యూస్ › పోటీ పరీక్షల సిలబస్‌పై టీజీపీఎస్సీ కీలక ప్రకటన
బ్రేకింగ్ న్యూస్

పోటీ పరీక్షల సిలబస్‌పై టీజీపీఎస్సీ కీలక ప్రకటన

12:24 మధ్యాహ్నం PM

సిలబస్ మార్పులపై అనధికారిక ప్రచారాన్ని నమ్మొద్దని అభ్యర్థులకు సూచన

హైదరాబాద్, సెప్టెంబర్ 22 (ప్రతినిధి):

తెలంగాణలో వివిధ ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల సిలబస్‌లో మార్పులు జరుగుతున్నాయంటూ వస్తున్న ప్రచారంపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) కీలక స్పష్టత ఇచ్చింది. సిలబస్ మార్పులకు సంబంధించి అభ్యర్థుల నుంచి పలు వినతులు, సందేహాలు అందుతున్న నేపథ్యంలో కమిషన్ సెప్టెంబర్ 21న వెబ్‌నోట్ విడుదల చేసింది.

ప్రస్తుతం సిలబస్‌ను మార్చేందుకు ఎలాంటి కమిటీని ఏర్పాటు చేయలేదని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఏదైనా నియామక పరీక్ష సిలబస్‌లో పెద్దస్థాయిలో మార్పులు చేయాలని నిర్ణయిస్తే.. అభ్యర్థులకు తగినంత సమయం లభించేలా కనీసం ఏడాది ముందుగానే సమాచారం అందిస్తామని తెలిపింది.

అదేవిధంగా సిలబస్‌లో స్వల్ప మార్పులు చేసినా వాటిని అభ్యర్థులకు తెలియకుండా చేయబోమని కమిషన్ స్పష్టం చేసింది. సంబంధిత ఉద్యోగ నియామక ప్రకటన జారీ చేసే సమయంలోనే సవరించిన సిలబస్ వివరాలను అధికారికంగా వెల్లడిస్తామని పేర్కొంది.

అనధికారిక సమాచారాన్ని నమ్మొద్దు

సిలబస్ మార్పులపై సోషల్ మీడియా, ఇతర అనధికారిక వేదికల్లో జరుగుతున్న ప్రచారాన్ని ఆధారంగా చేసుకుని అభ్యర్థులు తమ ప్రిపరేషన్ విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదని టీజీపీఎస్సీ సూచించింది.

పోటీ పరీక్షలకు సంబంధించిన సిలబస్, పరీక్ష విధానం, అర్హతలు, నియామక ప్రక్రియ తదితర అంశాల్లో టీజీపీఎస్సీ అధికారికంగా విడుదల చేసే నియామక ప్రకటనలు, సిలబస్ వివరాలనే ప్రామాణికంగా తీసుకోవాలని కమిషన్ స్పష్టం చేసింది. టీజీపీఎస్సీ అధికారికంగా గత నియామకాలకు సంబంధించిన సిలబస్, పరీక్ష విధానాలను తన వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతోంది.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 5🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
366 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App