Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి
Home › సామాజిక సేవ › ప్రణామ్ డే కేర్ సెంటర్‌లో వయోవృద్ధుల దినోత్సవ వారోత్సవాలు
సామాజిక సేవ

ప్రణామ్ డే కేర్ సెంటర్‌లో వయోవృద్ధుల దినోత్సవ వారోత్సవాలు

12:54 మధ్యాహ్నం PM

వృద్ధుల సంక్షేమ పథకాలు, చట్టాలపై అవగాహన.. ప్రత్యేక వైద్య శిబిరం

AYUSH24 News ప్రతినిధి

మంథని: సెప్టెంబర్ 29

అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా మంథనిలోని ప్రణామ్ డే కేర్ సెంటర్‌లో మంగళవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వయోవృద్ధుల సంక్షేమం, వారికి అందుబాటులో ఉన్న ప్రభుత్వ పథకాలు, చట్టపరమైన హక్కులు, సహాయ సేవలపై అవగాహన కల్పించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ గౌరవ కార్యదర్శి శ్రీనిజ కోయిర్కర్ హాజరై వయోవృద్ధుల సంక్షేమం, వారికి అందుబాటులో ఉన్న న్యాయ సేవల గురించి వివరించారు.

సీడీపీఓ పుష్పలతతో పాటు జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయ సిబ్బంది రాజయ్య (సూపరింటెండెంట్), స్వర్ణలత (ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్) పాల్గొని వయోవృద్ధులకు ఉపయోగపడే టోల్‌ఫ్రీ నంబర్లు, సంక్షేమ పథకాలు, చట్టాలకు సంబంధించిన వివరాలను తెలియజేశారు.

ఈ సందర్భంగా వయోవృద్ధుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఎంఎల్‌హెచ్‌పీ మంథని-1 డాక్టర్ శివాని ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది వివిధ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను అందజేశారు.

కార్యక్రమంలో న్యాయవాదులు శశిభూషణ్ కాచే, షబానా, జి. శ్రీలక్ష్మి, డే కేర్ సెంటర్ సూపరింటెండెంట్ పుష్పలతతో పాటు సీనియర్ సిటిజన్లు కాజా మొయినుద్దీన్, వేపచెట్టు రాజన్న, నూనె రాజేశం, రాజమౌళి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

అయుష్ 24 న్యూస్ — The Voice of Truth

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 48🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
366 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App