Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి
Home › బ్రేకింగ్ న్యూస్ › ప్రభుత్వ ఆసుపత్రి వద్ద 300 మందికి ఉచిత అల్పాహారం పంపిణీ
బ్రేకింగ్ న్యూస్

ప్రభుత్వ ఆసుపత్రి వద్ద 300 మందికి ఉచిత అల్పాహారం పంపిణీ

04:12 తెల్లవారుజాము AM

హంగర్ రిలీఫ్‌లో భాగంగా లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ, లయన్స్ క్లబ్ ఆఫ్ సహస్ర సంయుక్త సేవా కార్యక్రమం

దేవరకొండ, అక్టోబర్ 1, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:

అన్నం పరబ్రహ్మ స్వరూపమని, ఆకలితో ఉన్న వారికి ఆహారం అందించాలనే లక్ష్యంతో లయన్స్ క్లబ్‌లు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ ప్రెసిడెంట్ గుద్దేటి జంగయ్య, లయన్స్ క్లబ్ ఆఫ్ సహస్ర ప్రెసిడెంట్ వనం యాదమ్మ తెలిపారు.

లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ ఫాస్ట్ ప్రెసిడెంట్ వనం భిక్షమయ్య, యాదమ్మల మనుమడు నీఊరి ఆర్యన్ జన్మదినాన్ని పురస్కరించుకొని గురువారం దేవరకొండ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద హంగర్ రిలీఫ్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా సుమారు 300 మంది రోగులు, వారి అటెండర్లకు ఉచితంగా కిచిడీ అల్పాహారం పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు మాట్లాడుతూ సేవే పరమార్థంగా లయన్స్ క్లబ్‌లు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. విద్య, వైద్యం, ఆరోగ్యం తదితర రంగాల్లో కూడా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

అల్పాహార పంపిణీ కార్యక్రమాలకు దాతలు ముందుకు వచ్చి సహకరిస్తుండటం సంతోషకరమని తెలిపారు. జన్మదినాలు, వివాహ వార్షికోత్సవాలు, ఇతర శుభకార్యాల సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు లయన్స్ క్లబ్‌తో కలిసి ముందుకు రావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ గాజుల ఉషారాణి, లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ ప్రెసిడెంట్ గుద్దేటి జంగయ్య, ప్రధాన కార్యదర్శి కాశిరెడ్డి రవీందర్ రెడ్డి, కోశాధికారి చిలుకూరి కాశీనాథ్, వనం భిక్షమయ్య, లయన్స్ గాజుల రాజేష్, నీల బుచ్చయ్య, ఆవిర్నేని వెంకటేశ్వరరావు, వనం శ్రీనివాసులు, తిరందాసు పార్వతి, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 200🔗 Shares: 4👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
671 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App