రూ.5 వేల ఆర్థిక సాయం.. చిన్నారుల పేరుపై రూ.10 వేల ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తానని హామీ
నిజాంపేట మండలం, వెంకటాపూర్ — అయుష్ 24 న్యూస్:
నిజాంపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన భాస్కర్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ పరామర్శించారు.

భాస్కర్ మృతి విషయం కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మోహన్ నాయక్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన వెంకటాపూర్ గ్రామానికి చేరుకుని మృతుడి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అనంతరం కుటుంబానికి రూ.5,000 ఆర్థిక సహాయం అందించారు. అలాగే మృతుడి చిన్న పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వారి పేరుపై రూ.10,000 ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు అవసరమైన సమయంలో అండగా ఉంటానని మోహన్ నాయక్ భరోసా ఇచ్చినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మధుసూదన్ రెడ్డి, ఉప సర్పంచ్ ప్రవీణ్, వార్డు మెంబర్ పెంటయ్య, నరేష్, మహేందర్, అశోక్, ఎల్లం, సురేష్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
— అయుష్ 24 న్యూస్









Leave a Reply