విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలి: నేనావత్ దేవరన్ నాయక్
దేవరకొండ, సెప్టెంబర్ 13 — అయుష్ 24 న్యూస్:
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు యువనేత నేనావత్ దేవరన్ నాయక్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విఘ్నేశ్వరుని దివ్య ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజల జీవితాల్లోని విఘ్నాలన్నీ తొలగిపోయి ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. గణనాథుని కరుణాకటాక్షాలతో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం చేపడుతున్న ప్రతి సంకల్పం విజయవంతంగా సాకారం కావాలని కోరుకున్నారు.
వినాయకుని అనుగ్రహంతో దేవరకొండ నియోజకవర్గం అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో మరింత పురోగతి సాధించాలని ఆకాంక్షించారు.
మట్టి గణపతి విగ్రహాలనే పూజిద్దాం
సంప్రదాయాన్ని పాటిస్తూ మట్టి గణపతి విగ్రహాలను పూజించాలని దేవరన్ నాయక్ ప్రజలకు సూచించారు. మట్టి విగ్రహాలను పూజించడం ద్వారా ఆధ్యాత్మిక విశ్వాసంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడవచ్చన్నారు.
ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయనాలతో తయారు చేసిన విగ్రహాల వల్ల నీటి కాలుష్యం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంటూ, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ మట్టి గణపతి విగ్రహాలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.
“మనందరం మట్టి గణపతి విగ్రహాలను పూజిద్దాం.. పర్యావరణాన్ని రక్షించడంలో భాగస్వాములు అవుదాం” అని దేవరన్ నాయక్ కోరారు.
— అయుష్ 24 న్యూస్



Musini.Anjan





Leave a Reply