Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి● నవంబర్ 6లోగా పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి● బీసీల రాజ్యాధికారమే మా ధ్యేయం: తీన్మార్ మల్లన్న● దేవరకొండ నియోజకవర్గంలో రేపు ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన● రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడిని పరామర్శించిన ఎమ్మెల్యే బాలు నాయక్● సిటీ సివిల్ కోర్టును సందర్శించిన MSS లా కళాశాల విద్యార్థులు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి● నవంబర్ 6లోగా పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి● బీసీల రాజ్యాధికారమే మా ధ్యేయం: తీన్మార్ మల్లన్న● దేవరకొండ నియోజకవర్గంలో రేపు ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన● రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడిని పరామర్శించిన ఎమ్మెల్యే బాలు నాయక్● సిటీ సివిల్ కోర్టును సందర్శించిన MSS లా కళాశాల విద్యార్థులు
Home › దేవరకొండ › ప్రియాంక గాంధీ సంఘటన్ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షురాలిగా రామావత్ సరస్వతి
దేవరకొండ

ప్రియాంక గాంధీ సంఘటన్ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షురాలిగా రామావత్ సరస్వతి

05:02 తెల్లవారుజాము AM

ఆన్‌లైన్ ద్వారా నియామకం ప్రకటించిన జాతీయ అధ్యక్షుడు కమల్జిత్ సింగ్

జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్.బి. రాథోడ్‌కు కృతజ్ఞతలు తెలిపిన రామావత్ సరస్వతి

దేవరకొండ, అక్టోబర్ 08, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:

ప్రియాంక గాంధీ సంఘటన్ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షురాలిగా మర్రిగూడ గ్రామానికి చెందిన రామావత్ సరస్వతి నియమితులైనట్లు ఆ సంఘటన జాతీయ అధ్యక్షుడు కమల్జిత్ సింగ్ ప్రకటించారు. ఈ మేరకు గురువారం ఆన్‌లైన్ ద్వారా ఆమె నియామకాన్ని ప్రకటించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా కమల్జిత్ సింగ్ మాట్లాడుతూ, మర్రిగూడ గ్రామానికి చెందిన రామావత్ సరస్వతి విద్యావంతురాలని, విద్యార్థి దశ నుంచి ఎన్‌ఎస్‌యూఐ, యువజన కాంగ్రెస్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారని పేర్కొన్నారు.

మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు ప్రస్తావిస్తూ, ప్రియాంక గాంధీ ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. ఆమె నాయకత్వ లక్షణాలు, సేవలను గుర్తించి నల్లగొండ జిల్లా అధ్యక్షురాలిగా బాధ్యతలు అప్పగించినట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా రామావత్ సరస్వతి మాట్లాడుతూ, తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలకు పూర్తి న్యాయం చేస్తానని తెలిపారు. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ప్రియాంక గాంధీ సంఘటన్ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్.బి. రాథోడ్‌కు కృతజ్ఞతలు

తన నియామకానికి సహకరించిన సంఘటన జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్.బి. రాథోడ్‌కు రామావత్ సరస్వతి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

తన నాయకత్వంపై నమ్మకం ఉంచి జిల్లా స్థాయి బాధ్యతలు అప్పగించేందుకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ సంఘటన అభివృద్ధికి కృషి చేస్తానని రామావత్ సరస్వతి పేర్కొన్నారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 71🔗 Shares: 5👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
219 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App