జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లిన ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ సభ్యులు
దేవరకొండ, అక్టోబర్ 05, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
దేవరకొండ నియోజకవర్గ పరిధిలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి దృష్టికి దేవరకొండ ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ సభ్యులు తీసుకెళ్లారు.
దేవరకొండ ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ అధ్యక్షుడు లింగం జెఎల్ఆర్, సెక్రటరీ పొలాగోని సైదులు ఆధ్వర్యంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. అనంతరం దేవరకొండ నియోజకవర్గంలోని జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు సమస్యలు, ఇతర అంశాలపై ఆయనతో చర్చించారు.
దేవరకొండలో జర్నలిస్టులు ఐక్యంగా ఉంటూ తమ సమస్యల పరిష్కారానికి సమష్టిగా కృషి చేయాలనే ఉద్దేశంతో గత కొన్ని సంవత్సరాలుగా కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకుంటున్నట్లు ప్రెస్ క్లబ్ సభ్యులు తెలిపారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో దేవరకొండ ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు చంద్రమౌళి, కోశాధికారి బాలరాజు, జాయింట్ సెక్రటరీ మహేష్, బొడ్డు మల్లేష్, నాగిళ్ళ రవి, చంద్రప్రకాష్, శంకర్, జాఫర్, శ్రీను, ప్రవీణ్, హరి తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply