మాస్టర్ టి. చైతన్య శిక్షణలో రాణించిన ఖ్యాతి వనమకు టెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సత్కారం
ఆన్లైన్ కరాటే శిక్షణతోనూ అంతర్జాతీయ విజయాలు సాధించవచ్చని ప్రముఖుల అభిప్రాయం

హైదరాబాద్ | ఆగస్టు 2 (AYUSH24 NEWS):ఫ్రీ గురుకుల్ ఫౌండేషన్ ఆన్లైన్ కరాటే క్లాసెస్ ద్వారా మాస్టర్ టి. చైతన్య వద్ద శిక్షణ పొందిన విద్యార్థిని ఖ్యాతి వనమ రెండో ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్లో స్వర్ణ పతకం సాధించి ప్రతిభ చాటిన సందర్భంగా ఆమెను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా శ్రీ టి.వి. అశోక్ కుమార్ (రచయిత & దర్శకుడు, వరంగల్) చేతుల మీదుగా అభినందనలు అందుకున్నారు. అలాగే TELUGU BOOK OF RECORDS ఆధ్వర్యంలో, అమెరికాలోని ఆస్టిన్, టెక్సాస్ (USA) ప్రధాన సమన్వయకర్తల సహకారంతో నిర్వహించిన కార్యక్రమంలో ఖ్యాతి వనమకు పతకం మరియు ప్రశంసాపత్రం (Certificate) అందజేశారు.ఈ కార్యక్రమంలో రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ వ్యవస్థాపకురాలు శిహాన్ లక్ష్మీ సామ్రాజ్యం, విక్టరీ షోటోకాన్ కరాటే-డో అసోసియేషన్ వ్యవస్థాపకులు & అధ్యక్షులు క్యోషి ఆర్. మల్లికార్జున్ గౌడ్, గ్రాండ్ మాస్టర్ ఆర్.కె. కృష్ణ, గోపన్న, నాగరాజు మాస్టర్, క్యోషి చి. ప్రేమచంద్ర సింగ్, గ్రాండ్ మాస్టర్ శివకోటి తదితర ప్రముఖులు పాల్గొని ఖ్యాతి వనమను అభినందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆన్లైన్ కరాటే శిక్షణ ద్వారా కూడా అత్యున్నత స్థాయి నైపుణ్యాలను సాధించి జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో విజయాలు నమోదు చేయవచ్చని ఖ్యాతి వనమ నిరూపించిందని కొనియాడారు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు కూడా ఆన్లైన్ శిక్షణ గొప్ప అవకాశాలను కల్పిస్తోందని పేర్కొన్నారు.మాస్టర్ టి. చైతన్య మాట్లాడుతూ, క్రమశిక్షణ, నిరంతర సాధన, సరైన మార్గదర్శకత్వం ఉంటే ఆన్లైన్ ద్వారా శిక్షణ పొందిన విద్యార్థులు కూడా ప్రపంచ స్థాయిలో రాణించగలరని తెలిపారు. ఫ్రీ గురుకుల్ ఫౌండేషన్ ద్వారా మరింత మంది విద్యార్థులను తీర్చిదిద్ది అంతర్జాతీయ వేదికలపై నిలబెట్టేందుకు కృషి కొనసాగుతుందని చెప్పారు.ఖ్యాతి వనమ సాధించిన ఈ విజయం ఇతర కరాటే విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తుందని, భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ విజయాలు సాధించాలని పలువురు ప్రముఖులు ఆకాంక్షించారు.✍️ AYUSH24 NEWS”ప్రజల గొంతుక – నిజమైన వార్తలకు విశ్వసనీయ వేదిక”











Leave a Reply