దేవరకొండ, అక్టోబర్ 22:
దసరా శరన్నవరాత్రుల పర్వదినాన్ని పురస్కరించుకొని దేవరకొండ పట్టణంలోని 16వ వార్డు కన్యకా పరమేశ్వరి ఆలయంలో కొలువుదీరిన దుర్గామాత అమ్మవారిని దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ గారు భక్తిశ్రద్ధలతో దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పట్టణంలోని 9వ వార్డులో ప్రతిష్ఠించిన అమ్మవారిని దర్శించుకొని భక్తిపూర్వకంగా పూజలు చేశారు.
ఈ సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, ప్రతి కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరియాలని అమ్మవారిని ప్రార్థించారు. రైతులు, కూలీలు, మహిళలు, యువతతో పాటు అన్ని వర్గాల ప్రజలకు మంచి జరగాలని, దేవరకొండ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని దుర్గామాతను వేడుకున్నారు.
దుర్గామాత అమ్మవారి కరుణాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని, చెడుపై మంచి సాధించిన విజయదశమి స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ సౌభ్రాతృత్వం, ఐకమత్యంతో ముందుకు సాగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. అమ్మవారి దీవెనలతో ప్రజల జీవితాల్లో సంతోషం, శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని భక్తిపూర్వకంగా ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు: పున్న వెంకటేశ్వర్లు, ఆలంపల్లి నరసింహ, హనుమంతు వెంకటేష్ గౌడ్, మారుపాకుల సురేష్ గౌడ్, వాంకునావత్ బిక్కు నాయక్, మద్దిమడుగు రామస్వామి, గుద్దేటి మాదవి సత్యం, నల్లగాసు వీరయ్య, బొడ్డుపల్లి వరసాలా, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
📰 Ayush 24 News | దేవరకొండ
భక్తిశ్రద్ధలతో దుర్గామాతను దర్శించుకున్న ఎమ్మెల్యే బాలు నాయక్
దేవరకొండ, అక్టోబర్ 22: దసరా శరన్నవరాత్రుల పర్వదినాన్ని పురస్కరించుకొని దేవరకొండ పట్టణంలోని 16వ వార్డు కన్యకా పరమేశ్వరి ఆలయంలో కొలువుదీరిన దుర్గామాత అమ్మవారిని దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ గారు భక్తిశ్రద్ధలతో దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పట్టణంలోని 9వ వార్డులో ప్రతిష్ఠించిన అమ్మవారిని


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →








Leave a Reply